Pawan Kalyan: సోదరుడు లోకేష్ కు ధన్యవాదాలు… పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఇటీవల  కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగులను ఏపీకి తీసుకువచ్చిన విషయం తెలిసినదే. ఏనుగులను తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు అని మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.

ఈ విధంగా మంత్రి నారా లోకేష్ చేసిన ఈ  పోస్ట్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు.సోదరుడు నారా లోకేష్‌కు ధన్యవాదాలు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి  ప్రభుత్వం ఈ సమస్యకు ముగింపు పలకాలని ఉద్దేశంతోనే కుంకీ ఏనుగులను తీసుకొచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడంతో పాటు.. ఏనుగుల దాడులకు ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నాను అంటూ పవన్ నారా లోకేష్ పోస్ట్ పై స్పందిస్తూ రీ పోస్ట్ చేశారు.

నారా లోకేష్ యువగళం పాద యాత్రలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, పలమనేరుకు చెందిన కొంతమంది రైతులు ఏనుగుల దాడి కారణంగా చాలా నష్టాలను ఎదురుకుంటున్నట్టు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఈ సమస్యను అధిగమించడం కోసమే పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వం సహాయంతో ఆరు కుంకీ ఎనుగులను ఏపీకి తీసుకు రావడం పై లోకేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.