Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతిపై ఉన్న టాటూ గమనించారా… ఈ టాటూ మీనింగ్ అదేనా?

Pawan Kalyan: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చిన పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక టాటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతున్న సమయంలో తన చేతి పై ఒక టాటూ కనిపించింది.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చేతిపై ఉన్న ఈ టాటూ ఏంటి? ఆ టాటూ అర్థం ఏంటి అంటూ పెద్ద ఎత్తున అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ చేతికున్న ఆ టాటూ ఏంటనే విషయానికి వస్తే… పవన్ కళ్యాణ్ చేతికి ఉన్నది పర్మనెంట్ టాటూ కాదని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ ఆ టాటూ వేయించుకున్నారని ఆ టాటూ మీనింగ్ కూడా ఓజీ అని అర్థం వచ్చేలా ఉంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొన్నారు. ఇక ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని కంటే ముందుగానే కమిట్ అయ్యారు కానీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఆ తర్వాత అధికారంలోకి రావడం రాజకీయాలలో బిజీ కావడంతో సినిమా షూటింగ్ పనులు వాయిదా పడుతూ వచ్చాయి.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరు మల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతుంది.. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో కమిట్ అయిన ఓజి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా కమిట్ అయిన విషయం తెలిసిందే.