Y.S.Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు ఇదే విషయంపై అధికార నేతలు పలు సందర్భాలలో స్పందిస్తూ దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే జగన్ నేడు అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు.
నేడు 2025 -26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ గవర్నర్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పవన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.వైసీపీ ట్రాప్ లో పడవద్దని పార్టీ ఎమ్మెల్యేలను పవన్ అప్రమత్తం చేసారు. ప్రజల గొంతుకను అ సెంబ్లీలో వినిపిద్దామని పార్టీ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.
ప్రతి ఒక్కరు కూడా వారి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను సభలో తెలియజేయాలని అయితే ప్రతి ఒక్కరూ మాట్లాడే భాష చాలా హుందాగా ఉండాలని ఈయన ఎమ్మెల్యేలకు సూచించినట్టు తెలుస్తుంది.పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి శాసన సభ్యుడు, మండలి సభ్యులు చర్చల్లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. శాసనసభ సంప్రదాయాన్ని, మర్యాదను కాపాడుతూ హుందాగా ముందుకు వెళ్లాలన్నారు. ఇలా పవన్ తన ఎమ్మెల్యేల భేటీలో దిశా నిర్దేశాలు చేశారని తెలుస్తోంది.
