పవన్ కళ్యాణ్ త్వరగా అలాంటి సినిమా చేయాలి.. వైరల్ గా మారిన బండ్లన్న ట్వీట్

ప్రముఖ నిర్మాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిన పనిలేదు.ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ నిర్మాతగా కూడా పలు చిత్రాలకు పనిచేసే మంచి గుర్తింపు పొందారు. అయితే ప్రస్తుతం ఈయన సినిమాలకు దూరంగా ఉంటూ వివాదాలకు దగ్గరవుతున్నారు.ప్రస్తుతం ఈయన ఎలాంటి చిత్రాలను నిర్మించకపోయిన ఏదో ఒక విషయం గురించి సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. అయితే కొద్ది రోజుల వరకు పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ ట్వీట్లు చేసిన బండ్ల గణేష్ తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని ఆయన ఫోటో షేర్ చేస్తూ… నా దైవ సమానులైన మా పవన్ కళ్యాణ్ మీరు తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేష్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.ఇకపోతే ఈయన గత కొద్దిరోజులుగా తాను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటూ చెప్పుకోస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి ప్రకటన వెలబడలేదు.

 

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో బిజీగా మారిపోయారు. అదేవిధంగా ఆయన వరుస సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వడం వల్ల బండ్ల గణేష్ తనతో సినిమా చేయలేకపోతున్నానని గతంలో వెల్లడించారు. అయితే తాజాగా ఈయన చేసిన ట్వీట్ చూస్తుంటే త్వరలోనే పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రకటిస్తారా లేకపోతే తాను బ్లాక్ బస్టర్ సినిమాలో నటించాలని కోరుకున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గురించి పరోక్షంగా విమర్శలు చేసిన ఈయన తాజాగా దైవ సమానం అంటూ ట్వీట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఈయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.