జనసైనికుల మరణం తీరని విషాదం.. చిత్తూరు ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్

Madhavi Latha Comments On Pawan Kalyan Reaction On Fans Death

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తో ముగ్గురు జనసేన కార్యకర్తలు మరణించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. వాళ్ల మరణం తీరని విషాదమని అన్నారు. ఎంతో అభిమానంతో ముగ్గురు యువకులు ఫెక్సీ కడుతూ విద్యుత్ షాక్ తో మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు.

Pawan kalyan response on his fans death
Pawan kalyan response on his fans death

ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇక నుంచి వాళ్లకు నేనే బిడ్డను. వాళ్లను అన్ని రకాలుగా ఆదుకుంటాను.. అండగా ఉంటాను అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ఓ లేఖ ను పోస్ట్ చేశారు.

ముగ్గురు యువకులు మరణించడంతో పాటు మరో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో వాళ్లకు సరైన వైద్యం అందేలా చూడాలని చిత్తూరు జిల్లా నాయకులకు పవన్ సూచించారు. వాళ్లు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. గాయపడిన కార్యకర్తల కుటుంబాలకు తక్షణమే సాయం అందించాలని జిల్లా నాయకులను పవన్ కోరారు.

జిల్లాలోని శాంతిపురంలో పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్బంగా కార్యకర్తలు ఆయన ఫ్లెక్సీని కడుతున్నారు. ఈ సందర్భంలో ఐదుగురు యువకులకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు. చనిపోయిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు అన్నదమ్ములే కావడంతో శాంతిపురంలో విషాద చాయలు అలుముకున్నాయి. గాయపడిన వాళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.