Pawan Kalyan: ఏంటి పవన్ ని అందరూ సహాయం అడిగితే.. పవర్ స్టార్ మాత్రం అతన్ని సహాయం కోరుతున్నారా?

Pawan Kalyan: టాలీవుడ్ హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే గతంలో చాలామందికి తనకు తోచిన విధంగా సహాయం చేసి గొప్ప మనసును చాటుకున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే చాలామందికి సహాయం చేశారు పవన్ కళ్యాణ్. అడగకుండానే ఎదుటివారి కష్టం గుర్తించి సహాయం చేసే గొప్ప మనిషి పవర్ స్టార్. ఇటీవల నటి పాకీజా నోరు తెరిచి సహాయం అడగడంతో అడిగిన రెండు రోజుల్లోపే స్పందించి రెండు లక్షల రూపాయలు అందించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే అందరూ పవన్ కళ్యాణ్ ని సహాయం అడిగితే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఒకరిని అడిగారట. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరు అన్న విషయానికి వస్తే… పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ జూన్ 3న రిలీజయింది. ఈ ట్రైలర్ మొదట్లో తమిళ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఉంది.

అర్జున్ దాస్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ లో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు. మొదట అర్జున్ దాస్ హరిహర వీరమల్లు ట్రైలర్ షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఆయన మూవీ ట్రైలర్ కి నా వాయిస్ ఇమ్మని అడిగినప్పుడు ఏమి అడగకుండా ఎస్ అని చెప్పాను. ఇది మీ కోసం సర్ అని తెలిపాడు. అర్జున్ దాస్ చేసిన ట్వీట్ కి పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తూ డియర్ బ్రదర్ అర్జున్ దాస్ నేను నీకు కృతజ్ఞుడిని అయి ఉంటాను. చాలా అరుదుగా నేను సహాయం అడుగుతాను. నేను అడిగినదాన్ని చేసినందుకు ధన్యవాదాలు. నీ వాయిస్ లో మ్యాజిక్ ఉంది అంటూ ట్వీట్ చేసారు. పవన్ ట్వీట్ కి అర్జున్ దాస్ రిప్లై ఇస్తూ.. పవన్ కళ్యాణ్ సర్ ఈ మెసేజ్ నాకు ఎంత గొప్పదో మీకు తెలీదు. మీరు చాలా అరుదుగా సహాయం కోరే వ్యక్తి అని నాకు తెలుసు. ఆ అరుదైన సందర్భాలలో మీరు నన్ను ఎంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ విషయానికి వస్తే నేను మీకు ఎప్పుడూ ఒక కాల్ లేదా మెసేజ్ దూరంలో ఉంటాను అని తెలిపాడు.