రాజమౌళి సినిమాని రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్

ఎస్ ఎస్ రాజమౌళి అంతే ఒక పెద్ద బ్రాండ్. ఆయన సినిమాలో చిన్న రోల్ అయినా పర్లేదు అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. రాజమౌళి సినిమాలో హీరోగా ఛాన్స్ వొస్తే ఎంత పెద్ద స్టార్ అయినా ఎగిరి గంతేస్తాడు. కానీ, అలాంటి డైరెక్టర్ తో సినిమా ఓ స్టార్ హీరో మాత్రం ఆయన ఇచ్చిన ఆఫర్ ను కాదనుకున్నాడు. ఫలితంగా ఓ భారీ హిట్ ను కోల్పోయాడు.

అప్పట్లో మొదట్లో ‘సై’ సినిమాను మొదట రాజమౌళి పవన్ కళ్యాణ్ కి వినిపించాడట, కానీ పవన్ కళ్యాణ్ ఆ సినిమా తనకు సూట్ అవ్వడాన్ని రిజెక్ట్ చేసాడంట. అప్పటికే ‘జయం’, ‘దిల్’ సినిమాలతో ఊపుమీదున్న నితిన్ కు ‘సై ‘ తో ఇంకో హిట్ అందింది. కానీ ఆ సినిమా సక్సెస్ తర్వాత నితిన్ కి దాదాపు పది సంవత్సరాల వరకు హిట్ లేదు.

పవన్ కల్యాణ్ రాజమౌళి కాంబినేషన్ లో సై చిత్రం వస్తే అభిమానుల కోరిక తీరేది. స్టార్ డైరెక్టర్, అగ్రహీరో కలయికలో సై పెద్ద సంచలనాలే నమోదు చేసేది. ఇప్పుడు  మహేష్ బాబు తో సినిమా చేస్తున్న రాజమౌళి, ఫ్యూచర్ లో అయినా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడేమో చూడాలి.