టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్ట్ టైం పొలిటిషన్ నుంచి పార్ట్ టైం సినిమా హీరోలా మారాడని చెప్పాలి. దీనితో పవన్ ని నమ్ముకున్న దర్శక నిర్మాతలకు పవన్ డేట్స్ పరంగా అనేక ఇబ్బందులు ఇప్పుడు ఎదురవుతున్నాయి.
దీనితో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారగా పవన్ అయితే ఇపుడు ఓ దర్శకునికి ఫైనల్ క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ వెచ్చించి చేస్తున్న ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు”.
ఒక్క పవన్ కెరీర్ లోనే కాకుండా దర్శకుడు క్రిష్ కెరీర్ లో కూడా ఈ చిత్రం ఎంతో ప్రిస్టేజియస్ గా ఉంది. అయితే దాదాపు 50 శాతం అలా షూటింగ్ అయ్యిన ఈ చిత్రం పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే దీనిపై అయితే పవన్ ఒక సమాధానం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.
అక్టోబర్ లో తన బస్సు యాత్ర మొదలు కాబోతుండగా ఈ గ్యాప్ లో క్రిష్ కి ఈ చిత్రానికి బల్క్ డేట్స్ ని పవన్ కేటాయించబోతున్నాడట. ఈ గ్యాప్ లో దాదాపు సినిమా కంప్లీట్ అయ్యిపోతుందని తెలుస్తుంది. కాకపోతే ఇంకా ఈ టాక్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఈ ఒక్క సినిమా పవన్ కంప్లీట్ చేసేసినా చాలు అని పవన్ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు.