జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏస్టార్ హీరోగానీ, ఏ పొలిటికల్ లీడర్ గానీ, చివరికి సామాన్య మానవుడు సైతం తీసుకొని నిర్ణయం తీసుకుని షాక్ ఇచ్చారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అనుకున్నదే తడవగా దాన్ని వెంటనే ఆచరణలో పెట్టే టైప్. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం అంతే వేగంగా అమలులోకి వచ్చింది. అదీ కరోనా కష్ట కాలంలో ఉన్న సమాజం కోసం పవన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది చిరు వ్యాపారుల ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోవాలని, ప్రజలు బాగుండాలని స్వయంగా ఆయన ఓ దీక్షకు పూనుకున్నారు.
అదే చాతుర్మాస్య దీక్షను పవన్ చేపట్టారు. పోయిన బుధవారం తొలి ఏకాదశిగా పిలిచారు. అదే రోజున పవన్ ఈ దీక్షన్ మొదలు పెట్టారు. నాలుగు నెలల పాటు ఈ దీక్ష చేయనున్నారుట. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు విరమిస్తారు. అయితే ఈ నాలుగు నెలల పాటు పవన్ కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేస్తారుట. మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారుట. ఆ ఒకపూట తీసుకునే భోజనం కూడా చాలా మితంగా ఉంటుందిట. అంటే మధ్నాహ్నం మాత్రమే పవన్ భోజనం తీసుకుంటారు. ఉదయం, రాత్రి పూట కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఇలాంటి దీక్షలు పవన్ కి అలవాటేనట.
ప్రతి ఏడాది సాధారణంగా చేస్తుంటారుట. అయితే ఈ ఏడాది ఆ దీక్షను మరింత కఠినంగా చేస్తున్నట్లు చెబుతున్నారు. కేవలం ఒంటి పూట భోజనం తీసుకుంటే మంచి జరుగుతుందని ఆయన బలమైన నమ్మకం అట. ఇలాంటి దీక్షలు, ఉపవాసాలు చేయడం వల్ల మనిషి జీవన విధానం కూడా ఎంతో బాగుటుందని, కోపం, ఉద్రేకం, మనస్థాపం లాంటి సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. జీవితంలో ఏదైనా సాధించాలని కసి, పట్టుదల ఉన్న వాళ్ల లైఫ్ స్టైల్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.