Pawan Kalyan : సెకండ్ ఇన్నింగ్స్‌లో పవన్ కళ్యాణ్ జోరు మామూలుగా లేదు

Pawan Kalyan : ఒకదానిపై ఒకటి వరుసగా ప్రాజెక్టులు ఓకే చేసుకుంటూ పోతున్నారు. ఫ్యాన్స్‌కిది ఛాలా చాలా ఖుషీ అయిన సంగతే. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. సెకండ్ ఇన్నింగ్స్‌లో పవన్ చేసిన రెండు సినిమాల్లో ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ రెండూ రీమేకు సినిమాలే.

తాజాగా పవన్ కళ్యాణ్ ఇంకో రీమేక్‌లో నటించబోతున్నాడు. తమిళంలో సముద్ర ఖని నటించిన ‘వినోదయసితం’ సినిమా తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు. ఒరిజినల్‌లో సముద్రఖని పోషించిన పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఒరిజినల్‌లో సముద్రఖనే ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఆయనే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో ఆ సినిమాని రీమేక్ చేస్తుండడం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.

అంతా బాగానే వుంది. కానీ, వరుస పెట్టి రీమేకులు చేస్తుండడంతో రీమేకుల హీరో పవన్ కళ్యాణ్.. అంటూ పవన్ అభిమానేతరులు ఆయన్నిట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్స్ పవన్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

ఓ ఫెయిల్యూర్ సినిమాలో నటించినా పర్లేదు కానీ, ఈ రీమేక్‌లో నటించవద్దని పవన్ కళ్యాణ్‌కి సూచిస్తున్నారట. అయితే, పవన్ మాత్రం ఈ సూపర్ హిట్ తమిళ రీమేక్ విషయంలో అస్సలు తగ్గేదే లె.. అంటున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.