పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలిసి చేయబోయే చిత్రం మీద అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి ‘గబ్బర్ సింగ్’ లాంటి మాస్ కమర్షియల్ హిట్ ఇస్తారని అందరూ నమ్ముతున్నారు. హరీష్ శంకర్ అంటేనే మాస్ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు. కాబట్టి ఆయన పవన్ సినిమాను మాస్ జనాలకు నచ్చేలా తీస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే పవన్ సినిమాలు తీసే విధానం మారింది. మునుపటిలా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు సమాజ హితం కోరే సందేశం కూడ ఉండాలని భావిస్తున్నారు ఆయన. అందుకే రెండు భాషల్లో వచ్చిన ‘పింక్’ సినిమాను రీమేక్ చేశారు.
అలాగే మిగతా సినిమాల్లో కూడ సోషల్ మెసేజ్ ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన కోరిక మేరకు హరీష్ శంకర్ కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ ఉండేలా కథ రాశారట. ఈ చిత్రంలో స్టూడెంట్స్, రాజకీయాలు అనే అంశాన్ని ప్రస్తావిస్తారట. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడ సినిమా గురించి మాట్లాడుతూ ఇదే మాటను ప్రస్తావించారు. ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. సో.. పవన్, హరీష్ శంకర్ సినిమా అందరూ అనుకున్నదానికంటే భిన్నంగా ఉండబోతుందన్నమాట.ఇకపోతే ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఆగష్టు నెల నుండి మొదలవుతుంది.