Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి పవన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “భీమ్లా నాయక్” మంచి విజయాన్ని కూడా నమోదు చేసింది. అయితే పవన్ కళ్యాణ్ కోసం తెలుగు ప్రేక్షకులకి కొత్తగా చెప్పే పని లేదు. కొన్ని సందర్భాల్లో తాను ఎంత శాంతంగా ఉంటాడో అలాగే కొన్ని సందర్భాల్లో అంతే అగ్రెసివ్ గా కనిపిస్తాడు.
అయితే అది పొలిటికల్ గాని రియల్ లైఫ్ లో కూడా అని చెప్పాలి. కానీ పవన్ పై తన నిజ జీవితానికి సంబంధించి ఓ కీలక అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ స్కూల్ మేట్ అయినటువంటి ఒకతన్ని ఓ యూట్యూబ్ ఛానెల్ వారు ఇంటర్వ్యూ చెయ్యగా పవన్ తో తాము చదివిన 9, 10 తరగతి టైం లో జరిగిన నిజ సంఘటనను ఆయన తెలిపారు.
తమ స్కూల్ పరిధిలో కొంతమంది కుర్ర మూక తమ స్కూల్ ఆడపిల్లలను ఇబ్బందిపెట్టేవారని ఇది తమ దృష్టికి వారు తీసుకొచ్చినపుడు పవన్ అప్పట్లోనే చూపించిన స్పందన మేము ఊహించలేదని మిగతా వాళ్ళు అంతా ఏం చెయ్యాలా ఏమవుతుందా అని అనుకుంటే పవన్ ఒక్కడు మాత్రం రండి మనం వెళ్దాం అని పిలిచి ఆ చిల్లర మూక దగ్గరికి తీసుకెళ్లి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడని తెలిపారు.
అలాగే వాళ్ళకి ఇంకోసారి గాని ఇది రిపీట్ అయితే ఒక్కొక్కడికి తోలు పెరికేస్తా అని వార్నింగ్ ఇవ్వడం మాకు షాకింగ్ గా అనిపించింది అని ఆ ఆరోజు పవన్ ప్రవర్తించిన తీరు అయితే మాకు ఇంకా గుర్తుందని తాను తెలిపాడు. దీనితో ఇది పవన్ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారింది.