క్రిష్ ని మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ తో కనీసం ఒక్క సినిమా అయినా చెయ్యాలని దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ అనుకున్నాడంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చెయ్యడం అంతా ఈజీ కాదు. అతను ఎప్పుడు సినిమాలు చేస్తాడో, ఎప్పుడు పాలిటిక్స్ వైపు మళ్లుతాడో తెలియదు.

అప్పుడెప్పుడో క్రిష్ ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా పవన్ కళ్యాణ్ తో మొదలు పెట్టాడు. మధ్య లో కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ వచ్చింది, దాంతో ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ కూడా చేసేసాడు, కానీ క్రిష్ సినిమా మాత్రం ఇకేనా పూర్తి అవ్వలేదు.

ఈ సినిమా షూటింగ్ త్వరలో కంప్లీట్ అయ్యి రిలీజ్ అయిపోతుంది అనుకునే టైం లో పవన్ కళ్యాణ్ ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సినిమా కంటే ముందు మరో సినిమాలో పాల్గొనాలి అని పవన్ నిర్ణయం తీసుకుని క్రిష్ కు షాక్ ఇవ్వబోతున్నాడు అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఆర్డర్ లో ఒక రీమేక్ సినిమా కూడా ఉంది.తమిళంలో మంచి విజయం సాధించిన ‘వినోదయ సీతమ్’ అనే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు.

దీనితో పాటు ఎప్పటినుండో తన కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తున్న హరీష్ శంకర్ కి కూడా పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. ‘భవదీయుడు భగత్ సింగ్’ అస్సలు ఉంటుందో లేదో కూడా తెలియట్లేదు. గతంలో కూడా సంపత్ నంది ని రెండు సంవత్సరాలకు పైగా వెయిటింగ్ లో పెట్టి చివరకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను వేరే డైరెక్టర్ కి ఇచ్చాడు పవన్ కళ్యాణ్.