Pawan Kalyan: నలుగురు పిల్లలతో సందడి చేస్తున్న పవన్ కళ్యాణ్… ఫోటో వైరల్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఒక వైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నిత్యం బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ తన పిల్లలతో గడపడానికి సమయం కేటాయిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కిసంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ తన రెండో భార్య అన్నా లెజి నోవా తన నలుగురు పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి ఆధ్యా, అకీరా నందన్ అనే ఇద్దరు పిల్లలు కలరు.అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఈ పిల్లలు రేణుదేశాయ్ దగ్గర పెరుగుతున్నారు. ఇలా తనదగ్గర పెరుగుతున్నప్పటికీ వీరిద్దరికీ తండ్రి ప్రేమను కురిపిస్తుంది. ఎప్పుడు మెగా కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగిన పిల్లలు ఆ ఫంక్షన్లకి వెళ్తూ ఉంటారు. ఇలా తల్లిదగ్గర పెరుగుతున్నప్పటికీ తండ్రి ప్రేమకు దూరం కాకుండా రేణుదేశాయ్ వీరిని పెంచుతుంది.

ఇక పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత భార్య అన్నాలెజ్నోవాకి కూడా ఇద్దరు పిల్లలు అనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు పవన్ వీరందరితో ఎప్పుడూ సరదాగా గడిపిన విషయం గురించి మనం విన్నాం కానీ ఇలా నలుగురు ఒకే చోట ఉండటం, వీరితో పవన్ కళ్యాణ్ సరదాగా గడపటం ఎప్పుడూ చూడలేదు. ఇలా వీరందరూ ఒకే చోట సంతోషంగా ఉన్నటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫోటోని చూస్తుంటే దీపావళి సందర్భంగా దిగిన ఫోటో అని అనిపిస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖిరా ఒకే రకమైన దుస్తులు వేసుకోగా, రేణుదేశాయ్ కూతురు, అన్నా లెజ్ నోవా కూతురు కూడా ఒకే రకమైన దుస్తులు ధరించారు. ఇలా వీరందరూ నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉండడంతో ఈ ఫోటో పవన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు ఈ ఫోటోలో రేణుదేశాయ్ కూడా ఉంటే ఎంతో బాగుండేదని వారి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.