Pawan Kalyan: జగన్ పేరు చెప్పగానే నవ్వేసిన పవన్… ఆ నవ్వు వెనుక అంత అర్థం ఉందా?

Pawan Kalyan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం కూటమి పార్టీపై అలాగే కూటమి పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నేతలను కార్యకర్తలను హింసించిన వారిని ఎక్కడ ఉన్న వదిలిపెట్టనని సప్త సముద్రాల వెనుక ఉన్న లాక్కొస్తానంటూ డైలాగులు చెబుతున్నారు.

రెడ్ బుక్ అని నేను చెప్పను మీరు ఏ బుక్ లో పేరు రాసుకుంటారో రాసుకోండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సినిమా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అంటూ కూటమి పార్టీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు . అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

లిక్కర్ కేసులో భాగంగా మిమ్మల్ని అరెస్టు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి దీనిపై మీ స్పందన ఏంటి అంటూ రిపోర్టర్ ప్రశ్నించడంతో అందుకు జగన్మోహన్ రెడ్డి తాను విజయవాడలోనే ఉన్నాను వాళ్ళని ఎవరూ ఆపలేదు వచ్చే అరెస్టు చేసుకోండి అంటూ సమాధానం ఇచ్చారు. ఇలా జగన్ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కి కూడా ప్రశ్న ఎదురైంది. ఇలా జగన్ పేరు ఎత్తగానే పవన్ కళ్యాణ్ ఓ నవ్వు నవ్వేశారు. అయితే ఆ నవ్వుకు అర్థం ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ పేరు ఎత్తగానే వెటకారంగా నవ్వినారనే తెలుస్తుంది.

పవన్ తన రాజకీయ ప్రత్యర్థి జగన్ హెచ్చరికలపై మీడియా ప్రశ్నించేసరికి వికటాట్టహాసమే చేశారు. అంతే కాకుండా It’s Fine. Let’s see (ఏం పర్వాలేదు, చూద్దాం) అంటూ ముక్తసరిగా తేల్చేశారు. దీంతో పవన్ నవ్వుతున్న వీడియో వైరల్ అవుతోంది. జగన్ మాటల వరకు మాత్రమే ఉంటుందని చేతల వరకు ఉండదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ వెటకారంగా ఆ నవ్వు నవ్వుతూ చూసుకుందాంలే అంటూ మాట్లాడారని స్పష్టం అవుతుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది..