Pawan Kalyan: మేము మీ ఇంటికి వచ్చి కొడతాం…. సెలబ్రిటీల నుంచి ఏం ఆశించద్దు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా విజయవాడలో శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరైన విషయం మనకు తెలిసిందే.ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జాతీయ జెండా చేతబూని రెపరెపలాడిస్తూ సూమారు మూడు కిలోమీటర్లు వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

ఈ ర్యాలీలో భాగంగా పెద్ద ఎత్తున నగరవాసులు పాల్గొంటూ భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తించారు.బెంజి సర్కిల్ వద్ద ర్యాలీ ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.తిరంగా యాత్రకు మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానీకానికి నమస్కారాలు. దేశ విభజన జరిగిన నాటి నుంచి మనం ఏనాడు ప్రశాంతత చూడలేదు. కసబ్ లాంటి తీవ్రవాదులు దేశంలోకి చొరబడి 72 గంటల పాటు ఎలాంటి దాడులు చేశారో చూశాం.

ఈరోజు మనం విజయవాడ నడిబొడ్డున నిలబడి ఇలా మాట్లాడుతున్నాము అంటే దేశ సరిహద్దులలో మనల్ని కాపాడుతూ సైనికులు ఉన్నారనే నమ్మకమేనని తెలిపారు. సైనికులు మనకు మన దేశానికి ఎంతో చేస్తున్నారు మనం మన దేశానికి చేయగలిగింది ఒక్కటేనని సైనికులకు అండగా నిలబడటమే మన కర్తవ్యం అని తెలిపారు.మురళీ నాయక్ 23 ఏళ్ళ కుర్రాడు. భారత్ మాతాకీ జై చెప్పారు. అటువంటి వారే నిజమైన దేశ భక్తులు.
సెలబ్రిటీలు, హీరోలు ఎవరూ మాట్లాడడం లేదు అంటే వారెవరూ దేశాన్ని నడిపేవారు కాదు వాళ్లు కేవలం వినోదాన్ని అందించేవారు మాత్రమేనని తెలిపారు.

సినిమా సెలబ్రిటీల నుంచి మనం ఇంతకుమించి ఏమీ ఆశించకూడదు అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశభక్తుడు అంటే మురళి నాయక్ వంటి వారు మాత్రమేనని ఆయనే దేశభక్తి కోసం ప్రాణాలను కూడా త్యాగం చేశారని,అతని తల్లిదండ్రులకు ఏం చెప్పగలం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన శ్రీ మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.