Bheemla Nayak : షాకింగ్ – పవన్ ని విలన్ చేశారు..కాంట్రవర్సియల్ దర్శకుడి ఆవేదన.!

Bheemla Nayak : రీసెంట్ గా టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ మాస్ ఏక్షన్ ట్రీట్ సినిమా “భీమ్లా నాయక్” నుంచి నిన్న రాత్రి ట్రైలర్ విడుదల అయ్యి భారీ స్థాయి రెస్పాన్స్ ని అందుకుంది. అయితే అనుకున్న అంచనాలను అందుకే స్థాయిలో లేదనే టాక్ ఉన్నా ఈ ట్రైలర్ మాత్రం ఓ రేంజ్ రెస్పాన్స్ ని మాత్రం కొల్లగొట్టింది.

ఇక ఓ కొత్త సినిమా ట్రైలర్ వచ్చింది అంటే మన టాలీవుడ్ లో స్టార్స్ మధ్య ఉండే రచ్చ వేరు.. అనేక మంది దర్శకులు హీరోలు హీరోయిన్ లు ఈ ట్రైలర్ కోసం తమ స్పందనను తెలియజేసారు. అయితే ఈ ట్రైలర్ పై కాంట్రవర్సీ లకు కేరాఫ్ అయినటువంటి వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ ని విలన్ గా చూపించారని ఇది నాకు నచ్చలేదు అంటున్నాడు. అయితే ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి ఆడియెన్స్ ఈ ట్రైలర్ చూసాక రానా నే హీరోగా అనుకుంటారని వర్మ అంటున్నాడు.

బాహుబలి తర్వాత అక్కడ రానా కే ఎక్కువ క్రేజ్ ఉంది. అందుకే ఈ ట్రైలర్ ని గాని హిందీలో రిలీజ్ చేస్తే అక్కడ వాళ్ళు పవన్ ని విలన్ గా అనుకుంటారు. అసలు ఇలా పవన్ ఎందుకు చేసాడు అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. దీనితో ఇది కూడా వైరల్ అవుతుంది. అయితే ఓ రకంగా వర్మ చెప్పిన మాట నిజమే అని చెప్పాలి. మరి ఈ సినిమాకి హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మరి.