వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కింగ్.. జనసేనకు అన్నీ సీటు రావడం గ్యారెంటీ: పృథ్వీ రాజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ
పృథ్వీ రాజ్ గురించి మనకు తెలిసిందే. ఈయన ఎన్నో సినిమాలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా గత ఎన్నికలలో భాగంగా వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ, రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈయనకు ఎస్వీబీసీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ విధంగా ఈయన చైర్పర్సన్ గా కొనసాగుతున్న సమయంలో ఈయనకు సంబంధించిన ఒక ఆడియో బయటకు రావడం సంచలనం సృష్టించింది.

ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ మాట్లాడిన మాటల కారణంగా ఈయన తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ విషయంలో కొందరు రాజకీయ కుట్ర చేశారంటూ ఈయన ఆరోపించారు. ఈయన వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆయన పార్టీ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీ రాజ్ జనసేన పార్టీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈయన వైసీపీ పార్టీని తప్పుబడుతూ జనసేన పార్టీకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తప్పకుండా 40 నుంచి 50 సీట్ల వరకు గెలుపొందుతారని, వచ్చే ఎన్నికలలో ఆయనే కింగ్ అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేస్తారని ఆయనకు ఎలాంటి అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్నారు అంటూ పృథ్వీ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.