Pawan Kalyan : మళ్ళీ తన సినిమాల్లో వేలు పెడుతున్న పవన్ కళ్యాణ్?ఈ భారీ సినిమాకి అట.!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమాల్లోని అలాగే రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే తన రష్యా పర్యటన ముగించుకొని ఇండియాకి కూడా తిరిగి వచ్చాడు. అయితే ఇదిలా ఉండగా పవన్ ఇప్పుడు పలు ఆసక్తికర సినిమాలు చేస్తున్న సంగతి అందరినీ తెలిసిందే.

వాటిలో మొదటగా మాస్ మాసాలా చిత్రం “భీమ్లా నాయక్” ఆల్రెడీ దాదాపు షూటింగ్ కంప్లీట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉంది. అయితే దీని కన్నా ముందే పవన్ స్టార్ట్ చేసిన తన కెరీర్ లో భారీ సినిమా మాత్రం “హరిహర వీరమల్లు”.

ఇప్పుడు ఈ సినిమా విషయంలోనే పవన్ చాలా సినిమాల తర్వాత స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి వేలు పెడుతున్నాడట. అయితే ఇందులో నెగిటివ్ తీసుకోవడానికి ఏమి లేదట. దర్శకుడు క్రిష్ తో కలిసి ఈ సినిమా విషయంలో పవన్ కాస్త సీరియస్ గానే చేస్తున్నారట.

యాక్షన్ సహా మరికొన్ని అంశాల్లో పవన్ చాలా చురుకుగా ఈ సినిమాలో పాల్గొంటున్నాడట. మరి ఈ ఇన్వాల్వ్ మెంట్ ఎంతమేర సినిమాని నిలబెడుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా సంగీతం అందిస్తున్నారు.