పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన భారీ సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు అలాగే మరోపక్క తన రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా పవన్ మళ్ళీ సినిమాలు పట్ల కీలక నిర్ణయం తీసుకోనుండగా ఓ ఊహించని రూమర్ బజ్ రూపంలో వైరల్ అవుతుంది. మాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల చేసినటువంటి సినిమాల్లో క్లాసిక్ అయ్యిన పొలిటికల్ డ్రామా “లీడర్” కోసం అందరికీ తెలిసిందే.
రానా దగ్గుబాటి కెరీర్ లో కూడా ఇది ది బెస్ట్ సినిమా. అయితే దీనికి సీక్వెల్ ని కూడా శేఖర్ కమ్ముల రీసెంట్ గా తన లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ లో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ ని పవన్ తో తీస్తున్నాడని ఓ టాక్ వైరల్ అవుతుంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఖరాకండిగా చెప్పాలి. ఈ సినిమా సీక్వెల్ కూడా రానా తోనే ఉండనుంది.
పైగా ఎప్పుడు మొదలు అవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ విషయాన్ని కూడా శేఖర్ కమ్ములనే కన్ఫర్మ్ చేశారు. సో పవన్ ఈ క్రేజీ సీక్వెల్ లో నటించనున్నాడు అనేది పచ్చి అబద్దం. అయితే శేఖర్ కమ్ముల తన ప్రతి సినిమాని తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ నే ఊహించుకొని రాస్తానని చెప్పారు. దీనితో ఇలా కొంతమంది తమ క్రియేటివిటీ ని చూపిస్తున్నారు.