Pawan Kalyan In Bhola Shankar : ‘భోళా శంకర్’లో పవన్ కళ్యాణ్.. ‘ఖుషీ’ మ్యాజిక్ కోసమేనా.!

Pawan Kalyan In Bhola Shankar : సూపర్ హిట్ తమిళ మూవీ ‘వేదాళం’ను తెలుగులో ‘భోళా శంకర్’ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకుడు.
మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్‌కి పిచ్చ ఫ్యాన్. ఆ అభిమానంతోనే చిరంజీవి సినిమాలో పవన్ కళ్యాణ్‌తో ఓ మ్యాజిక్ చేయబోతున్నాడు.
అదేంటంటే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా కనిపించబోతున్నాడట. ఎలాగో తెలుసా.? పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషీ’ సినిమాలోని నడుం సీన్ ఎంత పాపులరో తెలిసిందే. పవన్ కళ్యాణ్, భూమిక మధ్య సాగే ఈ రొమాంటిక్ సీన్ యూత్‌‌కి ఎవ్వర్ గ్రీన్.
ఆ సీన్‌ ఈ సినిమాలో వుండనుందట. అయితే డైరెక్ట్ అదే సీన్ కాదట.
ఆ సీన్‌ని ఈ సినిమా కోసం రీ క్రియేట్ చేస్తున్నారట. ఓహో హీరోయిన్ అయిన తమన్నా, మెగాస్టార్ చిరంజీవిల మధ్య ఈ సీన్, రీ క్రియేట్ చేస్తారన్న మాట.. అనుకుంటున్నారా.? అయితే పప్పులో కాలేసినట్లే.
సన్నజాజి నడుము తమన్నా, రొమాంటిక్ చిరుల మధ్య ఈ సీన్ రీ క్రియేట్ చేస్తే వింతేముంది.!
ఈ సినిమాలో బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీముఖి, మెగాస్టార్ మధ్య ఈ సీన్ రీక్రియేట్ చేయబోతున్నారట. చాలా ఫన్నీగా వుండబోతోందట ఈ సీన్.
శ్రీముఖి నడుమందాలకు చిరంజీవి తిరిగే మెలికలు, ఆయన స్టైల్ ఛమక్కులు.. ఈ సీన్‌లో బోలెడంత కామెడీ పండించబోతున్నాయట. ఆ రకంగా పవన్ కళ్యాణ్‌ని ఈ సినిమా ద్వారా ఫ్యాన్స్ గుర్తు చేసుకోనున్నారన్న మాట.
ఏకంగా మెగాస్టార్ అంతటోడితో ఈ సీన్‌లో నటించే ఛాన్స్ కొట్టేసిన శ్రీముఖిది ఓ లక్ అయితే, సూపర్ సెన్సేషన్ అయిన ఆ నడుం సీన్ మెగాస్టార్‌తో రీక్రియేట్ చేయగా చూడడం ఫ్యాన్స్‌కి మరో పెద్ద పండగ.
మొత్తానికి మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న అభిమానాన్ని ఇలా తీర్చేసుకుంటున్నాడన్న మాట.