HariHara VeeraMallu: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అటు సినిమాలు ఇటు రాజకీయాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. దాదాపుగా ఐదేళ్లుగా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూ వచ్చి ఇటీవల ముగిసింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదల అయ్యి ఉండేది.
కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అవడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడంతో జూన్ 12న విడుదల చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్. కానీ సినిమాకు సంబంధించి కొన్ని పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో విడుదల తేదీని వాయిదా వేశారు. అయిదేళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా వచ్చేస్తుంది అనుకునేలోపు VFX పనులు ఇంకా అవ్వలేదని మరోసారి వాయిదా పడటంతో ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కొత్త రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని జులై 24 న రిలీజ్ చేయనున్నారు. మూవీ యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించింది. మరి ఈసారైనా చెప్పిన డేట్ కి రిలీజ్ చేస్తారా? మరోసారి చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారా చూడాలి మరి. పవన్ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ తో వేరే సినిమా రిలీజ్ డేట్స్ కూడా మారుతూ వస్తున్నాయి. మరి ఈ సినిమా ఇప్పుడు చెప్పిన డేట్ కి వస్తే మిగతా సినిమాలు కూడా తర్వాత క్యూ కట్టే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారని చెప్పాలి. మరి జూలై 24న అయినా కరెక్ట్ గా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి మరి.