Harihara Veeramallu Trailer: పులిని వేటాడే బొబ్బిలిని… ఆకట్టుకుంటున్న వీరమల్లు ట్రైలర్?

Harihara Veeramallu Trailer: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో నటించిన హరిహర వీరుమల్లు సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముందుగా కేటాయించిన థియేటర్లలోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. మూడు నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ వీడియో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించిందని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటన ఈ ట్రైలర్ లో చెప్పే డైలాగులు ట్రైలర్ కు హైలైట్ అయ్యాయి.

వీరమల్లు ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే.. “హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం”.. “ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం”.. “ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం”.. అంటూ ధర్మం కోసం పోరాటం ఎలా ఉంటుందో ట్రైలర్ స్టార్టింగ్ లో చూపించేశారు. “ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోహినూర్.. దాన్ని కొట్టి తీసుకురావడానికి ఒక రామబాణం కావాలి” అంటూ తనికెళ్ల భరణి చెప్పిన డైలాగుకు సింక్ అయ్యేలా పవన్ కళ్యాణ్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో రంగంలోకి ఎంట్రీ ఇస్తారు.

“ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూసుంటారు.. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్గా నిలిచింది.” వినాలి వీరమల్లు చెప్పిందే వినాలి” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు మాత్రం అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి ఇంకా ఇందులో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే ఈమె రాకుమారిలాగా ఎంతో అద్భుతంగా కనిపించారు. ఇక ఈ సినిమాలో యాక్షన్స్ సన్ని వేషాలలో పవన్ కళ్యాణ్ ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ను ఈ రేంజ్ లో చూడబోతున్నామని తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.