భారీ అంచనాల నడుమ విడుదలైన ‘వకీల్ సాబ్’ చిత్ర బ్రహ్మాండమైన వసూళ్లతో దూసుకుపోతోంది. కరోనా సెకండ్ వేవ్ గట్టిగా ఉంటుందనే భయాందోళనలో కూడ సినిమా భీభత్సం సృష్టిస్తోంది. మొదటిరోజు అనుకున్నట్టే 35 కోట్లకు పైగానే షేర్ రాబట్టింది. కానీ ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచకూడదనే ఆంక్షలు పెట్టడంతో వసూళ్లు 40 కోట్లను తాకలేకపోయాయి. అలాగని రెండవ రోజు వసూళ్లు డల్ కాలేదు. అదే జోరు కనబడింది. రెండవ రోజు కూడ దాదాపు మొదటిరోజు జోరే కనబడింది. రెండు రోజులకు 49 కోట్ల షేర్ నమోదు చేసింది.
ఇక మూడవ రోజు కూడ బాక్సాఫీస్ మీద పవన్ జోరు పనిచేసింది. షేర్ దాదాపుగా 60 కోట్లను టచ్ అయింది. కొన్నిచోట్ల నాన్ బాహుబలి-2 రికార్డులు కూడ బద్దలయ్యాయి. ఇలా మూడు రోజులకు మొత్తంగా 60 శాతం రికవరీ కనబడింది. దాదాపు 100 కోట్ల టార్గెట్ పెట్టుకుని సినిమా బరిలోకి దిగగా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేకపోయింది. దీంతో బయటపడగలమా లేదా అనే డైలమాలో పడ్డారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ మూడు రోజుల్లో నార్మల్ ధరలతో పవన్ సృష్టించిన వసూళ్ల జోరు అనుమానాలను పటాపంచలు చేసింది. ఈ వారంలో ఇంకో రెండు రోజులు సెలవులు ఉండనున్నాయి. కాబట్టి చిత్రం చాలా సులభంగా 100 కోట్ల మార్క్ దాటుతుందని, ఎంతో కొంత లాభాలు చూడగలమని నమ్మకం కలిగింది కొనుగులుదారుల్లో.