Pawan Kalyan: తనకు ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే తనతో పాటు కలిసి పని చేసిన స్టేజ్ ఆర్టిస్ట్‌లు ఎప్పుడూ ముందుంటారని ఆర్టిస్ట్ సమ్మెట గాంధీ తెలిపారు. అందరూ తనకూ ఇప్పటికీ టచ్‌లో ఉంటారని, తాను కూడా వాళ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తన ఫ్రెండ్స్ దాదాపు 30మంది ఉన్నారని వాళ్లందరూ కూడా తనకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తారని ఆయన చెప్పారు.
ఇకపోతే తనకు రాజన్న సినిమా ద్వారా చాలా గుర్తింపు వచ్చిందని సమ్మెట గాంధీ అన్నారు. ఈ మధ్య చేసిన వకీల్ సాబ్ సినిమా ద్వారా అది ఇంకా ఎక్కువైందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఎక్కడికెళ్లినా తనను అందరూ గుర్తు పడుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
సెట్‌లో ఉన్నప్పుడు ఒకామె జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి పవన్ కల్యాణ్ గారికి తన కూతురు పెళ్లి అని చెప్పి కార్డు ఇస్తే, వెళ్లేటప్పుడు కలువమ్మా అని చెప్పారట అని సమ్మెట గాంధీ తెలిపారు. ఆయన చెప్పిన ప్రకారం ఆమె వెళ్లేటప్పుడు కలిస్తే ఆయన స్పాట్‌లో లక్ష రూపాయలు ఇచ్చారని ఆయన చెప్పారు. ఇకపోతే పావలా శ్యామల నాటకాలు వేసేవారు కాబట్టి తనకు తెలుసు అని, ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చినపుడు పవన్ కల్యాణ్ హెల్ప్ చేశారని చెప్పడం మనకు ముందే తెలుసునని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ గారి దగ్గర దానగుణం ఉందని, పేదలపై దయాహృదయం కూడా ఉందని, అందుకే ఆయనకు అంత ఫాలోయింగ్ అని ఆయన స్పష్టం చేశారు.