Pawan Kalyan : తొలి సినిమా నుంచే పవన్ కళ్యాణ్ అంటే ఓ సెన్సేషన్. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అంటూ పవన్ తొలి సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి, వెనక్కి తిరిగి వున్న పవన్ కళ్యాణ్ ఫోటో వదిలారు. ‘ఎవరీ అబ్బాయ్’ అంటూ అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది.
ఆ తర్వాత ‘ఈ అబ్బాయే మన కళ్యాణ్’ అంటూ అసలు సిసలు పోస్టర్ రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చారు. ఇక అప్పటి నుండి మొదలైంది పవన్ మేనియా. సరే, అసలు విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన ఆ సినిమా ద్వారానే హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సుప్రియ.
పెద్దాయన అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు. ఒకే ఒక్క సినిమాలో నటించిందనుకోండి ఈ అమ్మాయి. అయితే, ఆ సినిమా నుండీ పవన్ కళ్యాణ్‌తో సుప్రియకు గొడవలంట.. అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. చిత్ర యూనిట్ నుంచే ఈ పుకార్లు పుట్టాయని అంటుంటారు.
ఇక పవన్ విషయానికి వస్తే, ఆయన చాలా మొహమాటస్థుడు. అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా వుంటాడు. సుప్రియ విషయం తీసుకుంటే, చాలా డైనమిక్ గాళ్. డేరింగ్ అండ్ డాషింగ్. పవన్‌తో విబేధాల విషయమై సుప్రియ దగ్గర ప్రస్థావన వస్తే, మా మధ్య అలాంటి గొడవలేం లేవు.
ఆయనంటే తనకెంతో అభిమానం, గౌరవమనీ చెబుతారామె.
తెరపై పెద్దగా కనిపించకపోయినా, తెర వెనుక వ్యవహారాల్లో అంటే, నిర్మాణం ఇతరత్రా వ్యవహారాల్లో సుప్రియ చాలా యాక్టివ్‌గా వుంటోంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మధ్యనే ‘గూఢచారి’ సినిమాలో తెరపై కనిపించింది సుప్రియ. అడవిశేష్ ఈ సినిమాలో హీరో.