Pawan Kalyan: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో పాల్గొంటూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఒకవైపు రాజకీయాల్లో మరొకవైపు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. కాగా మొన్నటి వరకు రాజకీయాలలో బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు.
ఇప్పటికే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో లేటెస్ట్ మూవీ ఓజీ కూడా ఒకటి. ఇప్పుడు ఈ సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ లో పవన్ డబుల్ రోల్‌లో కనిపించబోతున్నారట. అయితే పవన్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎప్పుడు డబుల్ రోల్ చేయలేదు. కానీ ఈ సినిమాతో ఆయన తన అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారట.

పవన్ యాక్ట్ చేస్తున్న డబుల్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని, ఒకటి గ్యాంగ్‌స్టర్ ఒజస్ గంభీరగా, మరొకటి ఊహించని ట్విస్ట్ తో కనిపిస్తుందని అంటున్నారు. ఈ విషయం ఫ్యాన్స్ లో హైప్ ను పెంచేస్తోంది. అంతేకాకుండా ఇది పవన్ ఫ్యాన్స్ కి ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. అలాగే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అని చెప్పవచ్చు. కాగా ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, శ్రియారెడ్డి లాంటి స్టార్ కాస్ట్ ఉంది. పైగా ఈ డబుల్ రోల్ టాక్ నిజమైతే, ఓజీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయం అన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరి పవన్ కు ఈ సినిమా ఏ మేరకు గుర్తింపును తెచ్చి పెడుతుందో చూడాలి మరి.
