మరో రీమేక్ సినిమాకు రహస్య పూజలు చేసిన పవన్ కళ్యాణ్..

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో పాటు ముందస్తు ఎన్నికల విషయంలో కూడా బాగా బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ఖాతాలో వరుస రీమేక్ సినిమాలు ఉండగా తాజాగా మరో రీమేక్ సినిమాను చేయనున్నట్లు తెలుస్తుంది.

గత కొన్ని రోజుల నుంచి సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ‘వినోదాయ సిత్తం’ రీమేక్ పవన్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయం గురించి ఇప్పటివరకు క్లారిటీ లేకపోగా.. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా రహస్యంగా పూజలు కూడా చేశారు అని.. ఈనెల 12 నుంచి సినిమా మొదలవుతుంది అని తెలుస్తుంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది.