Pawan Kalyan: ఆయనని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వస్తే ఏం లాభం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తరచూ సనాతన ధర్మం గురించి మాట్లాడటమే కాకుండా సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను ఎంతవరకు అయినా పోరాడుతాను అంటున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కువగా మనకు మాలలోనే కనిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈయన వ్యవహార శైలిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా సోమవారం హైదరాబాదులోనే ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. పిల్లల పాఠ్యాంశాల్లో ఇప్పటివరకు కూడా యుద్ధాలు గురించే తెలియజేశారు తప్ప సనాతన ధర్మం గురించి ఎక్కడ తెలియచేయలేదని తెలిపారు. సనాతన ధర్మాన్ని పాటించిన పాలకుల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని పవన్ తెలిపారు.

ఇటీవల నేను మదురైలోని మీనాక్షి ఆలయానికి వెళ్లా. అమ్మవారి మూల విగ్రహాన్ని ఎలా దాచిపెట్టారో అక్కడి పూజారులు వివరించారు. అన్ని మతాలు సమానమని చెప్పిన హిందూ ధర్మాన్ని చాలామంది తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆ విషయంలో నేను చాలా ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. నేను మంకు పట్టు పట్టే హిందువుని కాదు కానీ అన్ని మతాలు బాగుండాలని చెప్పే నా ధర్మంపై దాడి చేస్తున్నప్పుడు.. ఓట్లు వస్తాయా? పోతాయా అనే విషయం గురించి నేను ఆలోచించను.

ఏ దేవుడైతే ఉనికిని ఇచ్చాడో ఏ పరమాత్ముడైతే స్థానం ఇచ్చాడో.. ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులొచ్చినా నిష్ప్రయోజనం. రాజకీయాల పరంగా ఇతర మతాల గురించి దాడులు జరుగుతుంటే వెనకేసుకొస్తాము కానీ సనాతన ధర్మం గురించి మాత్రం మాట్లాడమని ఎందుకంటే ఎక్కడ ఓట్లు రాకుండా పోతాయనే భయం అని తెలిపారు దీని గురించి ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించి చర్చించాలి అంటూ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.