తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైకాపా నేతలపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, పల్లె కోనసీమ రైతులు పంట విరామ నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే రైతులు విరామం ప్రకటించారు అని అన్నారు.
కోనసీమ క్రాప్ హాలిడే పాపం వైకాపా ప్రభుత్వానిది అని అన్నారు. రైతుల నిర్ణయానికి భయపడి ధాన్యం డబ్బులు వేశారు అని.. పంట విరామం ప్రకటించిన రైతులపై ఆ ప్రభుత్వ నేతల విమర్శలు చౌకబారుగా ఉన్నాయి అని విమర్శలు చేశారు. ఇక ఈ విషయంలో రాజకీయాలు మాని సమస్యల గురించి పరిష్కరించాలి అని కోరారు.