“భీమ్లా నాయక్” రెండు గంటల్లో 15 డ్రెస్సులు..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ మాస్ డ్రామాలో రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. మలయాళం హిట్ ‘అయ్యప్పనం కోషియం’ కి రీమేక్ గా దేనిని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలు ఎంత స్ట్రాంగ్ గా పర్ఫెక్ట్ గా ఉంటాయో ఈ సినిమాలో కూడా అలానే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కొత్త మేకోవర్ లో పక్కా మాస్ గా కనిపించారు.

అయితే ఈ చిత్రంలో పవన్ జస్ట్ 2 గంటలో 15 డ్రెస్సులు మార్చాడట. ఈ విషయాన్ని తన సినిమా స్టైలిష్ట్ రజినీ తెలిపింది. సినిమా స్టార్టింగ్ కి ముందు సినిమా లుక్స్ టెస్ట్ కోసం పవన్ రెండు గంటల్లో చాలా ఓపికగా ఉండి 2 గంటల్లో 15 డ్రెస్సులు టెస్ట్ చేస్తే అప్పుడు ఫైనల్ గా ఇప్పుడు చూస్తున్న షర్ట్ లుంగీ లుక్స్ ఫిక్స్ అయ్యాయట. రెండు గంటల్లో 15 డ్రెస్సులు ఎలాంటి చిరాకు లేకుండా మారుస్తూ రావడం గ్రేట్ అనే చెప్పాలి.