Bheemla Nayak prerelease Business: రికార్డు స్థాయిలో పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్!

Bheemla Nayak prerelease Business: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్ చిత్రంగా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేకపోయింది. అయితే ఈ సినిమాని ఫిబ్రవరి 25 వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేయడానికి బయ్యర్లు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా రికార్డు స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. కేవలం ఒక కర్ణాటక ఏరియాలో మాత్రమే ఈ సినిమా ఏకంగా 9.6 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇదివరకే నటించిన వకీల్ సాబ్ సినిమా భారీ స్థాయిలో హిట్ సాధించడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగాయి.

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా 135 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడటం వల్ల బయ్యర్లు ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు.ఇక రేపు ముఖ్యమంత్రితో భేటీ అనంతరం సినిమా టికెట్ల విషయంలో క్లారిటీ వస్తే ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారు. ఇక రానా కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.