Pawan Kalyan: ఒకే ఒక్క స్పీచ్… పవన్ ఇమేజ్ మొత్తం డామేజ్….అసలు ఏం చెప్పాలనుకున్నారు?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను పిఠాపురంలో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. లక్షలాదిగా కార్యకర్తలు అభిమానులు జనసేన నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతుందనే ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇక ఈ కార్యక్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అటు తమిళనాడు రాజకీయ నాయకులు తమిళ ప్రజలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ సభ వేదికగా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడతారని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం పొంతన లేని వ్యాఖ్యలతో విమర్శలు పాలవుతున్నారు. ఈ ఒక్క సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మొత్తం డామేజ్ అయిందని పలువురు రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఈ సభ వేదికగా ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే క్లారిటీ లేకుండా పోయిందని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఒక వీడియోని విడుదల చేశారు.. ఈ వీడియోలో భాగంగా పవన్ కళ్యాణ్ 12 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం గురించి ఒక్క మాటలో చెప్పేశారు.ఒక నాయకుడు నిజాయితీగా తన గురించి తాను చెప్పే విషయాల పైన కూడా పవన్ పొంతన లేకుండా మాట్లాడుతున్నారంటూ విజయ్ కుమార్ తెలిపారు. కనీసం ఆయన ఏ ఊర్లో పుట్టారు ఎక్కడ చదివారు అనే విషయాలపై కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఒక్కో సభలో ఒక్కో పేరు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ కి కులం మతం లేదని చెబుతూ ఉంటారు కానీ కాపులు తనకు ఓటు వేయలేదని అడుగుతూ ఉంటారు.. తాను బాస్టిజం తీసుకున్నానని చెప్పి మైనార్టీలు క్రిస్టియన్ లో ఓట్లు వేయించుకొని ఎన్నికలలో గెలిచిన తర్వాత సనాతనాన్ని మారడంపై వీడియోలతో సహా చూయిస్తూ ఘాటుగా విమర్శలు కురిపించారు. అసలు జనసేన పార్టీ సిద్ధాంతం ఏంటి అనే విషయంపై వారి కైనా క్లారిటీ ఉందా అంటూ విజయ్ కుమార్ విమర్శలు వర్షం కురిపించారు.