Pawan Fans Waiting For This Only : పవన్ ఫ్యాన్స్ కి కావాల్సింది ఇదే కదా?? ఈ రేంజ్ ఏక్షన్ ఉందా.!

Pawan Fans Waiting For This Only

Pawan Fans Waiting For This Only :  తెలుగు చలన చిత్ర ప్రముఖ స్టార్ హీరో మరియు రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రాజకీయ పనులు మరియు సినిమాల్లో కూడా చాలా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక దానితో పాటుగా పాటుగా మరొకటి బ్యాలన్స్ చేస్తూ తాను వెళ్తున్నాడు.

అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” తో పలకరించగా ఇప్పుడు మరో భారీ సినిమా అందులోని తన కెరీర్ లోనే అసలు టచ్ చెయ్యని భారీ సినిమాగా దర్శకుడు క్రిష్ తో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చాలా వరకు అందరికీ తెలుసు ఒక గ్రాండ్ సినిమా అని భారీ విజువల్స్, యాక్షన్ ఉంటాయని.

కానీ లేటెస్ట్ గా అయితే అనుకున్న దానికి మించే పవన్ ని ఈ సినిమాకి వాడేస్తున్నట్టు అనిపిస్తుంది. పవన్ లో ఉన్న మార్షల్ ఆర్ట్స్ కళని పూర్తిగా బయటకి లాగేస్తున్నాడు. లేటెస్ట్ గా పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధం అవుతుండగా చిత్ర యూనిట్ కొన్ని మేకింగ్ ఫోటోలు రిలీజ్ చేశారు.

ఇవన్నీ చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ ఈ సినిమాలో దొరికేసేలా కనిపిస్తున్నాయి. అదిరే ఏక్షన్ సీక్వెన్స్ కి ప్రిపేర్ అవుతున్న పవన్ ఈటెల తో ప్రత్యేక యుద్ధ సన్నివేశాలు ఈ సినిమాలో చేస్తున్నట్టుగా అర్ధం అవుతుంది. దీనితో ఈ ఫోటోలు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కసారిగా వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మొత్తంగా అయితే ఈ సినిమాలో ఈ రేంజ్ లో ప్లానింగ్ లు ఉన్నాయని ఎవరూ అనుకోని ఉండరు.