వీరమల్లు.. ఫ్యాన్స్ భయపడుతున్నది దీనికే

Pawan fans fearing about Hari Hara Veeramallu out put

Pawan fans fearing about Hari Hara Veeramallu out put

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’ తాలూకు ఫస్ట్ లుక్ నిన్ననే విడుదలైంది. ఫస్ట్ లుక్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. క్రిష్ పవన్ ను ఇంత బాగా చూపిస్తాడని ఫ్యాన్స్ కూడ ఊహించలేదు. అందుకే సప్రైజ్ ఫీలయ్యారు. పవన్ ఆహార్యానికి వందకు వంద మార్కులు పడిపోయాయి. ఇక అభిమానుల్ని కంగారుపెడుతున్న అంశం సినిమా అవుట్ ఫుట్. పవన్ సినిమా బాగుంది అనిపించినా చాలు రిజల్ట్ వేరే లెవల్లో ఉటుంది. దాన్ని ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ చేసేస్తారు అభిమానులు. కానీ బాగుంది అనే టాక్ రావడమే చాలా కష్టం. పవన్ గత సినిమాలను చూస్తే చాలావరకు హడావుడిగా చుట్టేసినట్టే ఉంటాయి.

దర్శకులు అనుకున్నది తీయలేకపోయారో లేకపోతే ఇది చాలు పవన్ క్రేజ్ మీద నడిపేయవచ్చు అనుకున్నారో కానీ కొన్ని సినిమాలకు సరైన న్యాయం చేయలేదు. అందుకే అవి బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. ‘హరి హర వీరమల్లు’ వాటిలా కాకూడదనేది అభిమానుల కోరిక. డైరెక్టర్ క్రిష్ సినిమాను ఊరకనే చుట్టేసి పవన్ క్రేజ్ మీద భారం వేయకుండా పద్దతిగా సినిమాను తీస్తే తప్పకుండా హిట్టవవుతుందని, సినిమా అలాగే రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటివరకు చేసినవి మామూలు సినిమాలే.. కానీ ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి క్రిష్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని నమ్ముతున్నారు వాళ్లంతా. సుమారు 150 కోట్ల వ్యవయంతో ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ సుమారు 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ పుచ్చుకున్నారట.