Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమా కోసం ఆత్మహత్య చేసుకున్న పవన్ అభిమాని!

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు.ఇలా పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని ఈయన నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈనెల 25వ తేదీ విడుదల కాబోతుంది.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమాని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

జగిత్యాలలోని పురానీపేటలో 8వ తరగతి చదువుతున్న
పాండులోజి నవదీప్ నేడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 11 సంవత్సరాల వయసు కలిగిన నవీన్ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈనెల 25వ తేదీ విడుదల కాబోతుందని తెలియడంతో ముందుగా సినిమా టికెట్ బుక్ చేసుకోవడం కోసం తన తండ్రిని 300 రూపాయలు డబ్బులు అడిగారు. రోజు కూలి పనులు చేసుకుంటున్న ఆ తండ్రి 300 రూపాయలను ఇవ్వడానికి అక్కడికి సినిమా విడుదలకు చాలా రోజులు గడువు ఉంది తర్వాత ఇస్తానని తన తండ్రి నచ్చచెప్పారు.

ఇలా డబ్బులు అడిగితే తన తండ్రి ఇవ్వక పోయేసరికి ఎంతో అసహనం వ్యక్తం చేసిన ఆ కుమారుడు మీరు ఎప్పుడూ ఇంతే అంటూ లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు.లోపలికి వెళ్ళిన కుమారుడు ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే తన కుమారుడు ఉరివేసుకొని కనిపించేసరికి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మూడు వందల రూపాయల కోసం ఇంత దారుణమైన పని చేస్తావనుకోలేదు అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.