Pawan Director : వైరల్ : ఓటిటిలోకి ఎంటర్ అవుతూనే వారికి కౌంటర్ వేసిన పవన్ దర్శకుడు.!

Pawan Director : టాలీవుడ్ టాప్ మోస్ట్ స్టార్ దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడో తన ప్రస్థానం స్టార్ట్ చేసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ “గబ్బర్ సింగ్” తో స్టార్ డైరెక్టర్ స్టేటస్ ని తెచ్చుకోగలిగాడు. మధ్యలో మరికొన్ని సినిమాలు చేసి మెప్పించిన ఈ దర్శకుడు ఇప్పుడు మళ్ళీ తన పవర్ స్టార్ తోనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాకి ఇంకా చాలా సమయమే ఉండడంతో ఓటిటి లోకి రీసెంట్ గా ఎంటర్ అయ్యాడు. నిన్ననే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేశారు. “ఏ టి ఎం” అనే టైటిల్ ని కూడా పెట్టి ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ ని ప్లాన్ చేశారు.

మరి దీనిపై అనౌన్స్ చెయ్యడానికి పెట్టిన ప్రెస్ మీట్ లో హరీష్ శంకర్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి ఒకింత ఓటిటి పైనే కౌంటర్ వేసినట్టు ఉన్నాయని చెప్పాలి. థియేటర్స్ అనేవి పుణ్య క్షేత్రాలు వంటివి అని ఓటిటి అనేది ఇంట్లో పెట్టుకునే దేవుడి ఫోటో లాంటిది.

ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదా అని తిరుపతి వెళ్లడం మానము కదా థియేటర్స్ కూడా అలాంటివే. ఎన్ని ఓటిటి లు ఉన్నా థియేటర్లు అనేవి పుణ్య క్షేత్రం లాంటివి అని అద్భుతమైన వివరణ ఇచ్చారు. దీనితో ఈ మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక తాను పవన్ తో “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా ప్లాన్ చెయ్యగా దీనిలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.