Pawan Kalyan : బుక్ మై షో’ షోలో అయితే తన రికార్డ్ తానే కొట్టిన పవర్ స్టార్.!

Pawan Kalyan :  ప్రస్తుత ప్రపంచం అంతా కూడా అంతర్జాల మాయాజాలంలో మునిగి ఉన్న సంగతి తెలిసిందే. ఏది కావాలన్నా కూడా యిట్టె ఆన్ లైన్ లో అయ్యిపోతుంది. మరి అలానే సినిమా టికెట్స్ కి కూడా అనేక మాధ్యమాలు ఉన్నాయి. మరి వాటిలో అయితే మోస్ట్ పాపులర్ బుకింగ్ పోర్టల్ మాత్రం “బుక్ మై షో” అని చెప్పాలి.

దాదాపు దేశంలో అన్ని సినిమాల బుకింగ్స్ దీని నుంచే జరుగుతాయి. అయితే ఓ సినిమాపై హైప్ ఏ రేంజ్ లో ఉంది అనేది దీనితో కూడా తెలుస్తుంది. ప్రేక్షకులు ఏ సినిమాపై అత్యంత ఆసక్తిగా చూస్తున్నారు అనేది ఇంట్రెస్ట్స్ రూపంలో తెలియజేస్తారు.

మరి ఇప్పుడు అది మన టాలీవుడ్ సినిమాలు విషయానికి వస్తే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా “భీమ్లా నాయక్” నాన్ పాన్ ఇండియా జాబితాలో సెన్సేషన్ ని నమోదు చేసింది అని చెప్పాలి ఏకంగా మూడు లక్షల 75 వేల మందికి పైగా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరచడంతో మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ రికార్డు గా ఇది నిలిచింది.

అంతే కాకుండా దీనికి ముందు కూడా పవన్ సినిమా “వకీల్ సాబ్” మూడు లక్షల 12 వేలు ఇంట్రెస్ట్స్ తో హైయెస్ట్ గా ఉండేది. దీనిని మళ్ళీ పవన్ కళ్యాణే బద్దలుగొట్టి సరికొత్త రికార్డు నమోదు చేసాడు. మరి అలాగే ఆల్రెడీ బుకింగ్స్ పరంగా కూడా భీమ్లా నాయక్ భారీ స్థాయిలోనే జరుపుతుంది అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి మొదటి రోజులు ఎంత వసూలు చేస్తుందో అని ఇండస్ట్రీలో భీమ్లా కోసం చర్చ మొదలైంది.