Pawan Kalyan: ఎయిర్ పోర్టులో పవన్..వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ న్యూ లుక్..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలలో ఒకరు . పవన్ కళ్యాణ్ సినిమాలతో,అటు పాలిటిక్స్ తో ఎప్పుడు బిజీగా ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గ్రూప్ లో లుక్ అదరగొడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ , ట్రైలర్ విడుదలై జనాల్లో ఈ సినిమా మీద అంచనాలు పెంచేశాయి . ముఖ్యంగా ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ సినిమా పై అంచనాలు పెంచేలా ఉంది .

అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా..RRR , రాధే శ్యామ్ సినిమాలు సంక్రాంతి బరిలో ఉండటంవల్ల భీమ్లా నాయక్ సినిమా వాయిదా వేయవలసి వచ్చింది. ఈ సినిమా వాయిదా పడటంతో పవన్ కళ్యాణ్ రష్యా వెకేషన్ కు వెళ్లారు . కోవిడ్ కంటే ముందే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా, వారి పిల్లలు కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే . అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన భార్యా పిల్లలతో కలిసి న్యూ ఇయర్ , క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లారు . అక్కడ ఆయన భార్య పిల్లలతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ వెకేషన్ ఎంజాయ్ చేశారు . రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నెవాని మూడవ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే .

తాజాగా పవన్ కళ్యాణ్ రష్యా వెకేషన్ నుండి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు . అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త లుక్ నెట్టింట్లో వైరల్ అవుతుంది . ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ వస్తుండగా ఒక అభిమాని వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశాడు .ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ బ్లాక్ టీ షర్ట్ , జీన్స్ ధరించి హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా కొత్త లుక్కుతో కనిపించటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు . ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది