Samantha: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగు తమిళ చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత ప్రస్తుతం హాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలలో కూడా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా సమంత విడాకుల ప్రకటన తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్ లో దూసుకుపోతున్నారు.
సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన ఫొటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా ఎంతో ఓపికగా సమాధానం చెబుతున్నారు. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ గత పది సంవత్సరాల నుంచి మీతో ఎంతో స్నేహంగా మెలిగే స్నేహితులు ఎవరూ అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమంత తనదైన శైలిలో సమాధానం తెలియజేశారు. గత 20 సంవత్సరాల నుంచి మేఘన వినోద్ అనే వ్యక్తి తో తాను ఎంతో స్నేహంగా ఉన్నానని ఈ సందర్భంగా సమంత తన స్నేహితురాలు మేఘన వినోద్ గురించి తెలియజేశారు. ప్రస్తుతం పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.