అయ్యబాబోయ్.. చిలుకలు కూడా బాస్కెట్ బాల్ ఆడుతాయా? వైరల్ వీడియో

parrots playing basket ball video goes viral

మీకు రామచిలుకలు తెలుసా? నిజానికి రామచిలుకలు ఒకప్పుడు అడవుల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉండేవి. ప్రస్తుతం రామ చిలుకలు కనిపించడమే గగనంగా మారింది.

parrots playing basket ball video goes viral
parrots playing basket ball video goes viral

కొందరైతే రామచిలుకలను ఇంట్లో పెంచుకుంటారు. కొందరు జాతకాలు చెప్పేందుకు ఉపయోగించుకుంటారు. ఏది ఏమైనా రామచిలుకలను చూస్తేనే ముద్దొస్తుంది. అటువంటి కొన్ని చిలుకలు కలిసి బాస్కెట్ బాల్ ఆడితే ఎలా ఉంటుంది. ఇంకాస్త ముద్దు రావు అవి.

ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది. తెలంగాణకు చెందిన ఓ ఐఏఎస్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంత క్యూట్ గా చిలుకలు బాస్కెట్ బాల్ ఆడుతున్నాయంటూ పోస్ట్ చేశారు.

అయితే.. చిలుకలు బాస్కెట్ బాల్ ఎక్కడ ఆడాయి.. అనే విషయం మాత్రం తెలియదు. అయితే.. నెటిజన్లు మాత్రం ఆ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. రామచిలుకలు ఎంత చక్కగా బాస్కెట్ బాల్ ఆడుతున్నాయి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.