Pakeezah Vasuki: సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ స్టార్ ఉన్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి మంచిగా డబ్బు సంపాదించి లగ్జరీగా బతికిన వారు ఆ తర్వాత కాలంలో దీనస్థితిలో బతికిన సంఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. చాలామంది నటీనటులు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వెలుగు వెలిగి చివరికి దారుణమైన స్థితిలో చనిపోయిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం కూడా చాలామంది అలా దీనస్థితిలో గడుపుతున్న విషయం తెలిసిందే. వారిలో ఒకప్పటి లేడీ కమెడియన్ నటి పాకీజా వాసుకి కూడా ఒకరు.
ఒకప్పుడు ఎన్నో తెలుగు సినిమాలలో తమిళ సినిమాలలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పాకీజా. పాకీజా అనే క్యారెక్టర్ పేరుతో బాగా వైరల్ అయింది. దీంతో అప్పటి నుంచి ఆమెను పాకీజా వాసుకి అని పిలవడం మొదలుపెట్టారు. ఇకపోతే సినిమాలలో నటిస్తున్న సమయంలో బాగానే ఉన్న వాసుకి తర్వాత కాలంలో సినిమా అవకాశాలు దూరం అవ్వడంతో ఈమె పరిస్థితి చాలా దారుణంగా అవుతూ వచ్చింది. ముఖ్యంగా గత కొంతకాలంగా పాకీజా దీన స్థితిలో బతుకుతోంది. గతంలో మంచు విష్ణు, చిరంజీవి పలువురు నటీనటులు ఆమెకు సహాయం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సహాయం చేయమని కోరుతూ ఒక వీడియోని రిలీజ్ చేసింది.
ఆ వీడియోలో పాకీజా వాసుకి మాట్లాడుతూ.. నేను పాకీజాను. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం కు నమస్కారం. నేను చాలా కష్టంలో ఉన్నాను, మూడేళ్ళుగా సినిమా షూటింగ్స్, సీరియల్స్ లేవు. నా సొంత ఊరు కారైకుడిలో ఉంటున్నాను. రెండు సార్లు విజయవాడ వచ్చాను మిమ్మల్ని కలవడానికి కానీ కుదర్లేదు. నాకు తమిళనాడు ఆధార్ కార్డు ఉంది. ఏదైనా సహాయం చేసి ఆదుకోండి. నెలనెలా ఏదైనా పెన్షన్ వచ్చేలా చూడండి. నాకు పిల్లలు, మొగుడు లేరు, అనాథగా ఉంటున్నాను. ఏపీ నుంచి ఏదైనా సహాయం చేయండి మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ ఎమోషనల్ గా రిక్వెస్ట్ చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వీడియో ఏపీ డిప్యూటీ సీఎం వరకు చేరుతుందా, పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి మరి.