ఓటిటి : దెబ్బకి థింకింగ్ మారిపోవాలా.. “అన్ స్టాపబుల్” 2 తో బాలయ్య రెడీ.!

ఇప్పుడు ఓటిటి లో కంటెంట్ కి ఎలాంటి డిమాండ్ ఉందో తెలిసిందే. ఓ పక్క సినిమా వాళ్ళు మరో పక్క ఓటిటి కి కూడా సెపరేట్ గా అందిస్తున్న ఎంటర్టైన్మెంట్ తో భారీ ట్రీట్ అయితే ఆడియెన్స్ కి దక్కుతుంది. ఇక మన తెలుగు నుంచి అయితే మొదటి స్ట్రీమింగ్ యాప్ గా అల్లు అరవింద్ నుంచి ఆహా స్టార్ట్ అయ్యి ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఇక ఇందులో నందమూరి వారి స్టార్ హీరో బాలకృష్ణ తో మొదటిసారి ఓ టాక్ షో ని స్టార్ట్ చేసి వినూత్న ప్రయతం అయితే చేసారు. అన్ స్టాపబుల్ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ తో ప్లాన్ చేసిన ఈ సీజన్ ఇప్పుడు రెండో సీజన్లో కి వచ్చింది. అయితే ఈ షో ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుందా అని అంతా ఆసక్తిగా చూస్తుండగా ఆహా వారు అయితే ఈ డేట్ ని ఇప్పుడు తెలిపారు.

ఈ అవైటెడ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ఈ అక్టోబర్ 14 నుంచి స్టార్ట్ కానుండగా అక్కడ నుంచి ప్రతి శుక్రవారం కూడా కొత్త ఎపిసోడ్స్ తో బాలయ్య అలరించనున్నాడని తెలిపారు. ఇక దీనిపై డిజైన్ చేసిన కొత్త టీజర్ కట్ కూడా అదిరింది.

బాలయ్యతో మంచి సాహసాలు చేయిస్తూ ఈసారి ప్రశ్నలు, ఆటలు ఇలా అన్నీ కూడా మరింత డేర్, మరింత ఫైర్ లతో ఓ రేంజ్ ల ఉంటుంది అని చెప్తూ దెబ్బకి థింకింగ్ మారిపోవాలా అంటూ పంచ్ డైలాగ్ పేల్చారు. ఇక ఫస్ట్ ఎపిసోడ్ అయితే నారా చంద్రబాబు నాయుడు లోకేష్ లతో ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది ఇది ఎలా ఉంటుందో చూడాల్సిందే.