AP: జగన్ కి వద్దు కనీసం పవన్ కైనా ప్రతిపక్షం ఇవ్వండి… బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు!

AP: జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అంటే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ భీష్మించుకొని కూర్చున్న సంగతి తెలిసిందే .ఇటీవల ఆయన అసెంబ్లీలోకి వచ్చిన కొద్దిసేపటికే బాయ్కాట్ చేస్తూ బయటకు వెళ్లిపోయారు. వైసిపి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తాము ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి అసెంబ్లీలో అవకాశం ఉంటుందని వైసీపీ కోరుతున్నారు.

ఇక ప్రతిపక్షం అనేది తాము ఇచ్చేది కాదని ప్రజలు ఇస్తేనే వస్తుంది అంటూ అధికారపక్ష నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలోనే అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేకపోతే ప్రజా సమస్యలను ప్రశ్నించేది ఎవరు ప్రజా సమస్యలు తెలియాలి అంటే తప్పనిసరిగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసిపి నేతలు కోరుతున్నారు.

ఈ క్రమంలోనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే పర్లేదు కానీ రాష్ట్రంలో రెండోపెద్ద పార్టీ అయినటువంటి జనసేనకు అయినా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ ఈయన కోరారు. వైసీపీకి 11 స్థానాలు వచ్చినప్పటికీ 40% ఓటు బ్యాంకు ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేనకు అత్యధిక సీట్లు వచ్చాయి కనుక పవన్ కళ్యాణ్ కు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు కదా అంటూ బొత్స తనదైన శైలిలోనే పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇస్తూ మాట్లాడారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ సైతం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం గురించి మాట్లాడుతూ వైసీపీకి ప్రతిపక్ష నేత హోదా రాదని ఒకవేళ ఓటు శాతం బట్టి తనకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే జగన్ ఆంధ్రాలో కాకుండా జర్మనీకి వెళ్లాల్సి ఉంటుంది అంటూ పంచులు వేసిన సంగతి మనకు తెలిసిందే.