రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటివారి రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు బడా హీరోలను పెట్టి మల్టీస్టారర్ తీస్తున్నారు జక్కన్న. అందుకే సినిమా మీద విపరీతమైన హైప్ ఉంది. అందునా ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో బిజినెస్ వర్గాల్లో అయితే విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికే థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ బిజినెస్ పూర్తయింది. నిర్మాత దానయ్య మంచి లాభాల్ని చూశారు.
నిజానికి సినిమా గతేడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా లాక్ డౌన్ మూలంగా వాయిదాపడింది. ఈ ఏడాది అక్టోబర్ 13న సినిమా రిలీజ్ కానుంది. అయితే షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనేది అభిమానులకు క్లారిటీ లేదు. సినీ సన్నిహిత సమాచారం మేరకు సినిమాలో ఇంకో రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ టీమ్ అంతా బ్రేక్ తీసుకుని ఉన్నారు. ఇంకో వారంలో సాంగ్స్ షూట్ మొదలవుతుందట. వాటి తర్వాత ఇంకాస్త ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంటుందట. ఇవి పూర్తయితే టాకీ పార్ట్ పూర్తిగా ముగిసినట్టే.