సినిమా ఇండస్ట్రీ లో విడాకులు కామన్ అయిపోయింది. నాగ చైతన్య, సమంత, ధనుష్, ఐశ్వర్య, అమల పాల్, ఆమిర్ ఖాన్, ఇలా విడాకుల లిస్ట్ చాలా ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఇంకో హీరో కూడా చేరబోతున్నట్టు సమాచారం.
‘బిచ్చగాడు’ సినిమాతో పాపులర్ అయిన విజయ్ ఆంథోనీ కూడా తన భార్య నుండి విడిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి. తన భార్య ఫాతిమా కి తనకు మనస్పర్థలు వచ్చాయని, దాని వల్లే విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తుంది.
తనని ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చిన ఒక జర్నలిస్ట్ తో ప్రేమలో పది తననే పెళ్లి చేసుకున్నాడు విజయ్. 2006 వీరి వివాహం జరిగింది. అయితే దీనిపై విజయ్ ఆంటోనీ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు.