One Disaster Changes Life Of Star Director : ఒక్క డిజాస్టర్ ఆ స్టార్ డైరెక్టర్ కెరీర్‌నే మలుపు తిప్పేసిందిగా.!

One Disaster Changes Life Of Star Director

One Disaster Changes Life Of Star Director :  ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆ డైరెక్టర్ కెరీర్‌లో వున్నాయ్. స్టార్ హీరోలకు తిరుగులేని బ్లాక్ బస్టర్స్ అందించిన డైరెక్టర్ ఆయన. కానీ, ఆ ఒక్క డిజాస్టర్ ఆయన కెరీర్‌ని సర్వ నాశనం చేసేసింది. పాతాళంలోకి నెట్టేసింది. కెరీర్‌పై కోలుకోలేని దెబ్బ తీసింది. ఇంతకీ ఎవరా డైరెక్టర్.? అంతలా దెబ్బ తీసిన ఆయన సినిమా ఏంటీ.?

అక్కినేని అందగాడు అఖిల్ హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా ‘అఖిల్’. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్. అంతవరకూ వి.వి.వినాయక్‌తో సినిమా చేయాలని తహతహలాడిపోయేవారు కుర్ర హీరోలు. ఆయన సినిమా అంటే వేరే లెవల్.. అనేంతలా వుండేది ఆయన మేకింగ్.

అలాంటిది ‘అఖిల్’ సినిమా విషయంలో అంచనాలు తారుమారైపోయాయి. బహుశా అఖిల్ టైమ్ బ్యాడ్ కావచ్చు అది. ఈ సినిమా హిట్ కావడానికి బోలెడన్ని అంశాలున్నాయ్. కానీ, ఎందుకో అస్సలు జనాలకి ఎక్కలేదీ సినిమా. హీరోయిన్ డాన్సులు, అందచందాలూ, భారీ యాక్షన్ సన్నివేశాలూ.. విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలానే వున్నాయ్.

కానీ, డిజాస్టర్ లిస్టులోకి చేరిపోయింది ఈ సినిమా. ఈ దెబ్బ నుండి కోలుకోవడానికి వినాయక్‌కి చాలా చాలా టైమ్ పట్టింది. వినాయక్ వైభవం తిరిగి రావడానికి స్వయానా మెగాస్టార్ చిరంజీవి రింగులోకి దిగాల్సి వచ్చింది. మెగాస్టార్ పుణ్యమా అని ఆయన 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ వినాయక్ మళ్లీ తన వైభవాన్ని తిరిగి తెచ్చుకున్నాడు వి.వి.వినాయక్.