Thagubothu- Ramesh: మరోసారి తండ్రి అయిన తాగుబోతు రమేష్.. కూతురి ఫోటో వైరల్!

Thagubothu- Ramesh: ప్రముఖ హాస్యనటుడు తాగుబోతు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో తాగుబోతు పాత్రలలో నటించి విశేష ప్రేక్షకాదరణ పొందిన తాగుబోతు రమేష్ వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాల ద్వారా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ మరింత ప్రేక్షకాదరణ పొందుతున్నారు. ఇలా వెండితెరపై, బుల్లితెరపై దూసుకుపోతున్న తాగుబోతు రమేష్ మరోసారి తండ్రి అయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తాగుబోతు రమేష్ 2017వ సంవత్సరంలో స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ దంపతులకు 2017 వ సంవత్సరంలో ఆడబిడ్డ జన్మించింది. తాజాగా మరొక బిడ్డకు స్వాతి జన్మనిచ్చినట్లు తాగుబోతు రమేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తన కూతురి ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు పెద్ద ఎత్తున తాగుబోతు రమేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎన్నో సినిమాలలో తాగుబోతు పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడంతో ఈయన ఇంటిపేరు కాస్తా తాగుబోతుగా మారిపోయింది. సినిమాలలో తాగుబోతు రమేష్ గా నటించినప్పటికీ నిజ జీవితంలో తనకు మందు అలవాటు లేదని ఎన్నోసార్లు రమేష్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్నారు. ఇలా వెండితెరపై బుల్లితెరపై తన సత్తా చూపిస్తూ తాగుబోతు రమేష్ ప్రేక్షకులను సందడి చేస్తున్నారని చెప్పవచ్చు.