ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెద్దలు ఊరికనే అనలేదు. ఎప్పుడైనా పాతే గొప్ప. పాతకాలాన్ని, అప్పటి అలవాట్లను నేటికీ.. ఈ సాంకేతిక యుగంలోనూ అనుసరిస్తున్నాం. ప్రస్తుత జనరేషన్.. పాత తరం అలవాట్లనే అలవాటు చేసుకుంటోంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పడానికి ఇంకో ఉదాహరణ కూడా ఉంది.
మీ దగ్గర ఈ రూపాయి నాణెం ఉంటే చాలు.. వెంటనే లక్షాధికారులు అయిపోతారు మీరు. కాకపోతే ఆ రూపాయి నాణెం కనీసం వందేళ్ల నాటిది అయి ఉండాలి. పురాతన నాణేలకు మన దగ్గర ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసు కదా.
ఇండియా మార్ట్ వెబ్ సైట్ లో పురాతన నాణేలను వేలం వేస్తుంటారు. మీ దగ్గర ఎటువంటి పురాతన నాణేలు ఉన్నా.. అందులో వేలం వేసి వేలు, లక్షలు పొందొచ్చు. అయితే.. మీ దగ్గర ఒకేళ 1913 కాలం నాటి రూపాయి నాణెం ఉంటే మీరు వెంటనే లక్షాధికారులు అయిపోతారు.
1913 నాటి రూపాయి నాణానికి ఇండియా మార్ట్ లో 25 లక్షల ధర పలుకుతోంది. దాన్ని వెండితో తయారు చేశారు. విక్టోరియా కాలం నాటి నాణెం అది. అలాగే 18వ శతాబ్దంలో రూపొందిన నాణెనికి 10 లక్షల ధర, 1818 సంవత్సరంలో తయారు చేసిన నాణేనికి 10 లక్షల ధరను నిర్ణయించారు.
ఒకవేళ మీదగ్గర ఇటువంటి పురాతన నాణేలు ఉంటే.. ఇండియా మార్ట్ వెబ్ సైట్ లో అమ్ముకోవచ్చు. లక్షలు సంపాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీ దగ్గర అటువంటి విలువైన పురాతన నాణేలు ఉంటే వెంటనే ఇండియా మార్ట్ లో అప్ లోడ్ చేసి లక్షలు సంపాదించండి.