ఈరోజైనా ఎన్టీఆర్ తేల్చిపారేస్తాడా ?

Ntr May Announce His Next Movie Today Or Tomorrow

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఎవరితో అనేది అభిమానుల్లో మెదులుతున్న పెద్ద ప్రశ్న. నిన్నమొన్నటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినబడినా ఇప్పుడు మాత్రం కొరటాల శివ తెర మీదికి వచ్చారు. ఆయనతోనే తారక్ సినిమా కన్ఫర్మ్ అంటున్నారు. ప్రజెంట్ కొరటాల ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యే నాటికి తారక్ ‘ఆర్ఆర్ఆర్’ ముగించుకుంటారు. ఇద్దరూ ఒకేసారి ఖాళీ అవుతారు. కాబట్టి కొత్త సినిమా మొదలుపెట్టడానికి ఇద్దరికీ అదే మంచి సమయం అవుతుంది.

ఇటీవలే అయన తారక్ కు లైన్ వినిపించారని, అది నచ్చడంతో తారక్ వెంటనే ఓకే చెప్పేశారని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా రేపు ఉగాది రోజున లాంఛ్ అవుతుందనే టాక్ కూడ నడుస్తోంది. సొషల్ మీడియాలో దీని గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే కొరటాల వైపు నుండి లేదా ఎన్టీఆర్ వైపు నుండి ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో అభిమానుల్లో పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది. ఇంతకీ తమ అభిమాన హీరో ఎవరితో సినిమా చేస్తారా, అందరూ అంటున్నట్టు రేపే కొరటాలతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారా అనే అనుమానాలతో సతమవుతున్నారు. మరి చూడాలి ఈరోజు రేపట్లో తారక్ ఏదైనా తేల్చుతారేమో.

 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles